AP Transfers 2019 Online Application - ఆంద్రప్రదేశ్ ట్రాన్స్ఫర్లు 2019

AP Transfers 2019 are available from today . Check AP General Transfers 2019 Online Application @ Transfers.ap.gov.in . ఆంద్రప్రదేశ్ ట్రాన్స్ఫర్లు 2019 - ఆంద్ర ప్రదేశ్ జనరల్ ట్రాన్స్ఫర్లు 2019 ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తం గా అందుబాటులోకి వస్తున్నాయి . నూతన విద్య సంవత్సరం మొదలు ఐన కారణం గా ఈ ట్రాన్స్ఫర్ ల నుండి టీచర్ లకి మినహాయింపు ఇస్తున్నట్టు ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ జి ఓ నెంబర్ 45 ద్వారా తెలపడం జరిగింది . ట్రాన్స్ఫర్ లు రిక్వెస్ట్ బేసిస్ మీద జరుగుతాయి . పరిపాలన సులభతరం చెయ్యడం కోసం గవర్నమెంట్ వారు ఎక్కడైనా ఎవరిని అయినా మార్చే రైట్ కలిగి ఉన్నారు . 

ఎవరు అర్హులు :

ఎవరు ఐతే 5 లేదా అంతకన్నా ఎక్కువ సవంత్సరాలు ఒకే చోట పని చేసి ఉన్నారో వారిని కచ్చితం గా స్థాన చలనం చెయ్యవలసింది గా నిర్ణయించారు . పిల్లల ఆరోగ్యం బాగాలేని వారు మరియు కిడ్నీ లేదా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వారు , వితంతువులు అయిన వారికి ఈ ట్రాన్స్ఫర్లు లలో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది . మ్యూచువల్ పెట్టుకొని కూడా ఇద్దరు ఉద్యోగులు తమ ప్లేస్ లు మార్చుకోవచ్చు .

ఎవరు అనర్హులు :

సిబిఐ లేదా అవినీతి నిరోధక శాఖ కేసు లలో ముద్దాయి గ ఉన్న వారు మరియు విచారణ జరుగుతున్న వారు , సస్పెన్షన్ ఉన్న వారు , కంటి చూపు సరిగా లేని వారు , మార్చ్ 20 కి అంట కన్నా ముందే రిటైర్ అయ్యే వారు లేదా కొత్తగా ప్రమోషన్ పొందిన వారు ఈ ట్రాన్స్ఫర్ లకి అర్హులు కారు 

ఆంద్ర ప్రదేశ్ ట్రాన్స్ఫర్లు 2019 కి అప్లై చేసుకోడం ఎలా 

ఇక విషయానికి వస్తే ఈ ట్రాన్స్ఫర్ లలో అప్లై చేసుకోడానికి transfers.ap.gov.in అనే వెబ్సైటు లోకి వెళ్లి మీ ఎంప్లాయ్ కోడ్ ఎంటర్ చెయ్యడం ద్వారా మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ  వస్తుంది . ఆ ఓటీపీ ని ఎంటర్ చేసిన తరువాతః కాలీగా ఉన్న ప్రదేశాల లిస్ట్ మీకు చూపిస్తుంది . అందులో మీకు నచ్చిన  3 ఏరియా లను సెలెక్ట్ చేసుకోవాలి . ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మరొక సారి కన్ఫార్మ్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి . ఇలా చెయ్యడం ద్వారా మీ ఆప్షన్ రిజిస్టర్ అవుతుంది . అందరు ఆప్షన్ ల నమోదు ప్రక్రియ అవగానే జిల్లా కేంద్రాలలో అలాట్మెంట్  ప్రక్రియ మొదలు అవుతుంది . మీరు సెలెక్ట్ చేసిన 3 ఏరియా లలో ఏది అందుబాటులో ఉంటె దాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది . ఒక వేళా మీరు ఎంచుకొన్న కేంద్రాలు ఇంతకన్నా ముందే వేరొకరికి కేటాయిస్తే మీకు మరొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది 

0 comments:

Post a Comment